Header Banner

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర మలుపు.. త్రిముఖ పోటీతో ఉత్కంఠ! సాయంత్రంతో ప్రచారాలకు తెర!

  Tue Feb 25, 2025 17:22        Politics

ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది. 35 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ముగ్గురు ప్రధాన అభ్యర్థులు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారాలకు ఈరోజు సాయంత్రంతో తెరపడడంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మూడు లక్షల 15 వేల 267 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకోసం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్యే త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుతో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, వామపక్ష పార్టీల మద్దతుతో యుటిఎఫ్ అభ్యర్థిగా డి.వి. రాఘవులు, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జి.వి. సుందర్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.


ఇది కూడా చదవండి: భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..


ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా రూటు మార్చింది. ఇప్పటి వరకు ఈ ఎన్నికలకు తాము దూరంగా ఉంటామంటూ ప్రకటించిన వైసీపీ పార్టీ ఇప్పుడు కూటమి అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం అనుచరులు, కార్యకర్తలంతా పీడీఎఫ్ బలపర్చిన అభ్యర్థి విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేసింది. ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలందాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూపొందించిన ఓటర్ల జాబితాపై వైసీపీ ఆది నుంచి నిరసనను ప్రదర్శించింది. ఈ జాబితాలో పలు అవకతవకలు ఉన్నాయంటూ ఆరోపణలు గుప్పించింది. అర్హతలేని పలువురికి ఓట్లిచ్చారంటూ పార్టీ నాయకులు రోడ్డెక్కారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిష్కరించారు. తాజాగా వైసీపీ తీసుకున్న నిర్ణయానికి కూటమి షాక్లో ఉంది.


ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #mlcelections #campaigning #lastdate #evening #todaynews #flashnews #latestupdate